Saturday, November 23, 2024

ఏ చిన్న లక్షణం కనిపించినా….ఆలస్యం చేయకండి – విజయ్ దేవరకొండ

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో మాస్క్ లు, భౌతిక దూరం పాటించడంతో పాటు కొన్ని లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సైతం చెబుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఇదే విషయాన్ని ఓ వీడియో రూపంలో తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ఇండియాను చాలా ఇబ్బంది పెడుతుంది. 2020లో మనం అందరం ఎంతో కష్టపడ్డాం. బయటపడ్డాం అనుకునేలోపే పరిస్థితులు ఇంకా ఘోరంగా మారిపోయాయి. లక్షలాదిమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు.

ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కనీసం మనమందరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే….ఈ పరిస్థితి నుంచి బయట పడవచ్చు. ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే చికిత్స తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. దగ్గు ,జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నాయి అంటే అదే కరోనా అనుకొని జాగ్రత్తలు తీసుకోండి. టెస్ట్ చేయించుకుని రిజల్ట్ వచ్చేవరకు నిర్లక్ష్యం చేయకండి. ఏ లక్షణాలు ఉన్న కరోనా గా భావించి నిబంధనలు పాటించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రంలో, ఏరియా హాస్పిటల్స్ లో, బస్తి దావఖాన లో కరోనా ఔట్ పేషెంట్స్ డాక్టర్లను పెట్టారు. మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. మీరు ఏ గవర్నమెంట్ ఆసుపత్రి కి వెళ్ళినా మందులను ఒక కిట్ రూపంలో ఇస్తారు. అవి వాడితే సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.

Advertisement

తాజా వార్తలు

Advertisement