లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాస్టర్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఇటీవల ఈ చిత్రం తమిళ్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కాగా ఊహించని రీతిలో టిఆర్పి రేటింగ్ వచ్చింది. విజయ్ గతంలో నటించిన బిగిల్ ,సర్కార్ రేటింగ్స్ ను కూడా ఈ సినిమా క్రాస్ చేయలేకపోయింది. బిగిల్ కు 21.9 టిఆర్పి రేటింగ్ రాగా సర్కార్ కు 21.7 రేటింగ్ వచ్చింది. మాస్టర్ కి మాత్రం 17.1 టిఆర్పి మాత్రమే వచ్చింది.
అయితే దీనికి కారణం లేకపోలేదు. మాస్టర్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కావడంతో ఈ తక్కువ టిఆర్పి రేటింగ్ వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టెలివిజన్ ఇంప్రెషన్స్ లో కూడా గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ చిత్రం ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. సర్కార్ చిత్రానికి 16.9 మిలియన్స్ రాగా మాస్టర్ కు 13.75 మిలియన్స్ వచ్చాయి.