కెరీర్ పరంగా తాను ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలోనే స్టార్ హీరోయిన్ నయనతారతో తన ప్రేమకథ ప్రారంభమయిందని చెప్పాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్. తాను సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో నేనూ రౌడీనే కథ రాశానని… తన వద్ద కథ ఉందని తెలుసుకున్న హీరో ధనుశ్ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడని చెప్పాడు. నయనతారను కలిసి కథ గురించి చెప్పమన్నాడని, నయన్ ఈ కథను అంగీకరించదని తొలుత తాను భావించానని… అయినా, ధనుష్ మాటను కాదనలేక నయన్ ను కలిశానని తెలిపాడు. ఆమె తనను ఎంతో గౌరవించిందని, ఆ క్షణమే ఆమెతో ప్రేమలో పడిపోయానని చెప్పాడు. ఆ సినిమా రెండో షెడ్యూల్ నుంచే తాము డేటింగ్ ప్రారంభించామని, తాము ప్రేమలో ఉన్నామనే విషయం తాము చెప్పేంత వరకు ఎవరికీ తెలియదని వెల్లడించారు. సెట్ లో మాత్రం నయన్ ను తాను మేడమ్ అనే పిలిచేవాడినని, ఆమె కారావ్యాన్ లోకి కూడా వెళ్లే వాడిని కాదని… వృత్తి పట్ల ఎంతో కమిట్ మెంట్ తో ఉండేవాళ్లమని చెప్పాడు.
కాగా నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ లు ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చింది.
ఆ సినిమాకే నయనతారతో లవ్ లో పడ్డా.. విఘ్నేశ్ శివన్
Advertisement
తాజా వార్తలు
Advertisement