Tuesday, October 1, 2024

Vettaiyan సెన్సార్ పూర్తి.. రేపే ట్రైలర్ రిలీజ్ !

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘వెట్టయన్’. జ్ఞానవేల్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్క‌నుంది. కాగా, ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక దాంతో పాటు ఈ సినిమా ట్రైలర్ ను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా, ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాని అక్టోబర్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement