రాంగోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదాన్ని రేపుతూ ఉంటారు. రాజకీయాలు సినిమాలు ఇలా సంబంధం లేకుండా ప్రతి విషయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా మరో ట్వీట్ చేసి వార్తల్లోకి ఎక్కారు వర్మ. టీషర్ట్ ధరించిన ఓ అమ్మాయి ఫోటోని పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో అమ్మాయి టీషర్టుపై 2019లో నెగెటివ్ మనుషులని దూరం పెట్టాము. 2020లో పాజిటివ్ వ్యక్తులను దూరం పెట్టాము. 2021లో మనుషులనే దూరం పెట్టాల్సి వచ్చిందని రాసి ఉంది.
ఈ ఫోటోని షేర్ చేసిన వర్మ అసలు 2022లో మనుషులే ఉండకపోవచ్చు.. అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వర్మ చెప్పిందే నిజం అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.