సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి సినీ అభిమానులకు కొత్తగా చెప్పనవసరం లేదు. ఆయన పేరు చెప్తేనే అందరికీ అర్థం అయిపోతుంది. అక్కడ ఏదో ఒక కాంట్రవర్సీ ఉందని… అయితే ఇటీవల వర్మ అక్కినేని హీరో సుమంత్ పై తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశాడు. సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఓ వెడ్డింగ్ కార్డ్ వైరల్ కాగా… ఒకసారి అయింది ఇంకా బుద్ధి రాలేదా అంటూ కామెంట్ చేశాడు.
ఇదిలా ఉండగా ఆగస్టు 5న జెనీలియా పుట్టినరోజు సందర్భంగా భార్యపై ప్రేమను చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జెనీలియా తో గడిపిన మధుర క్షణాలు సంబంధించిన వీడియో అది. అయితే రితేష్ చేసిన ట్వీట్ పై స్పందించారు వర్మ.ప్రపంచవ్యాప్తంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న జంట మీది మాత్రమే కావచ్చు అంటూ అంటూనే బర్త్ డే విషెస్ చెప్పారు వర్మ.