Saturday, November 16, 2024

Victory Venkatesh : నిరాడంబ‌రంగా వెంకీ రెండో కుమార్తె వివాహం..

తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి రామానాయుడు స్టూడియోలో జరిగింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించారు.

- Advertisement -

అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు.. కానీ ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి చేశారు.. హీరోల ఇంట పెళ్లి అంటే హాడావిడి మాములుగా ఉండదు.. కానీ వెంకటేష్ ఎందుకు సింపుల్ గా చేశారో అని అభిమానులు ఆలోచనలో పడ్డారు..
హయవాహిని పెళ్లి గ‌త రాత్రి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు మాత్రమే హాజరైయారు.. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇకపోతే , వెంకటేష్,నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement