Tuesday, November 5, 2024

Lucky Bhaskar | ఈ సినిమా ఎందుకు చూడాలంటే…

  • స్టాక్ మార్కెట్ ఎత్తులు
  • బ్యాంకులలోని మ‌న‌ డ‌బ్బులతోనే వ్యాపారం
  • మీకు తెలీయ‌కుండానే మీ ఖాతాల‌లో ట‌ర్నోవ‌ర్
  • అంద‌రికీ అర్ధ‌మ‌యే విధంగా స్క్రీన్ ప్లే
  • అడ‌గుడుగున టెన్ష‌న్.. హీరోపై జాలి
  • ల‌క్కీ భాస్క‌ర్ మూవీలో వెంకీ అట్లూరి మ్యాజిక్

తెల్లవారు ఝామునే వచ్చిన తెలుగు ఇంగ్లీషు హిందీ పేపర్ల మొదటి పేజీ లో “అతని మొహం” ..”అతిపెద్ద కుంభకోణం ..ఆర్థిక నేరగాడు “అనే పేరుతో కథనాలు. తన గురించి వచ్చిన ఆ న్యూస్ జైల్లో నే చదివి “నాకో అరగంట టైం ఇచ్చి , నన్ను నా ఆఫీస్ లో ఎనిమిది గంటలు వదిలితే నేను ఈప్రాబ్లం నుండి బయట పడతా అందరూ సేఫ్ అన్నాడట..తన ఎదురుగా నిలబడిన అధికారులతో..

ప్రైవేటు, గవర్నమెంట్ బ్యాంకులు,రిజర్వ్ బ్యాంక్ ,సీబీఐ ఇన్ని ఇన్వాల్వ్ అయిపోయిన అతిపెద్ద స్కాం .. అందుకే ఇప్పటికీ అతనిది ఒక డైలాగ్ బాగా ఫేమస్..”రిస్క్ హై తో ఇష్క్ హై”

“2001 ,డిసెంబర్ 31” భారత దేశ ఆర్థిక రాజధాని బాంబేలో జనం అంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే పనిలో ఉంటే 47 ఏళ్ల “అతను” మాత్రం బాగా కడుపులో నొప్పి అంటూ మెలికలు తిరుగుతుంటే, జైల్ సిబ్బంది హాస్పిటల్ కి తీసుకెళ్ళిన కాసేపటికి చనిపోయాడు… అతనే “హర్షద్ మెహతా”.

27 ఏళ్ళ దిగువ మధ్యతరగతి వ్యక్తి, ఒక కామర్స్ గ్రాడ్యుయేట్, ఫైనాన్షియల్ ఎనలిస్ట్, ఒక స్టాక్ బ్రోకర్, డబ్బు సంపాదించాలనే కసితో వచ్చి.. కోట్ల డబ్బుని, దలాల్ స్ట్రీట్ ని, బ్యాంకు లని చేతిలో పెట్టుకుని భారత దేశంలో మొదటిసారి వేల కోట్ల డబ్బుని చాక చక్యంతో పక్కాగా వాడేశాడు.

షేర్ మార్కెట్, బిజినెస్ డీల్స్, వ్యాపార అవసరాలు, పెద్దవాళ్ళతో పరిచయాలు, మీడియాతో స్నేహం, బిజినెస్ వార్తలు, కాస్తో కూస్తో విదేశీ బిజినెస్ ట్రెండ్స్.. వీటిమీద సామాన్యులకి అంత పెద్ద అవగాహన ఉండదు. అందుకే హర్షద్ మెహతా కుంభకోణం చాలా మందికి తెలీదు… ఎప్పటిదాకా అంటే పద్మశ్రీ “సుచేత దలాల్” అనే ఒక లేడీ జర్నలిస్టు ప్రముఖ ఇంగ్లీష్ పత్రికల్లో రాసేదాకా.. ఇంటిపేరు పద్మశ్రీ కాదు మన గవర్నమెంట్ ఆవిడకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది.

- Advertisement -

స్కాం గురించి సింపుల్ గా చెప్తా…

భారతదేశం లో బిగ్ బుల్ మార్కెట్.. దలాల్ స్ట్రీట్ లో ‘హర్షద్ మెహతా’ ఒక స్టాక్ షేర్ బ్రోకర్. కోట్ల రూపాయలను, బ్యాంకులలో లోన్ పెట్టి తీసుకుని, ఆ డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, లాభాలు గడించి తిరిగి 15 రోజుల్లో బ్యాంకులకి చెల్లించడం చేసేవాడు. ఓ బ్యాంక్ తో మొదలుపెట్టి అన్ని బ్యాంకులని చుట్టేస్తూ, డబ్బుని రొటేట్ చేసేవాడు. రెడీ ఫార్వడ్ డీల్, బ్యాంకు రీసిప్ట్ నీ వాడి డబ్బును మంచి నీళ్ళకంటే కూడా దారుణంగా తన చుట్టూ తిప్పుకున్నాడు.. బ్యాంక్ రిసిప్టుల ని, సంతకాలని ఫోర్జరీ చెయ్యడం ఎంత పెద్ద నేరం.. ఇదంతా మీరు ‘‘స్కాం 1992’’ అనే వెబ్ సిరీస్ లో చూసే ఉంటారు..

తెలుగులో కానీ హిందీలో కానీ డైరెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ మీద “ఒక సామాన్యుడు ఎలా హర్షద్ మెహతా స్కాంలో ఇన్వాల్వ్ అయి బయటికి వచ్చాడో చూసి ఉండరు.. ఇలాంటి కొత్త స్క్రిప్ట్ తో ఊహించని కథతో వెచ్చిన వెంకీ అట్లూరి తీసిన సినిమా “లక్కీ భాస్కర్.”

ఈ సినిమా హర్షద్ మెహతా కథ కాదు అతని స్కాంలో ఇరుక్కుపోయి తెలివిగా బయటపడిన ఒక సామాన్యుడు గాథ. వెబ్ సిరిస్ కాదు. సినిమా అంటున్నా.. దర్శకుడు ఎంత గొప్పగా స్క్రీన్ ప్లే చేశాడు అంటే 90 ల్లో ఒక వ్యక్తి జాగింగ్ కి “నైక్ షూస్ “వేసుకోవడం తో మొదలుపెట్టడం. చాలా తక్కువ ధరకి వడాపావ్ కొనలేని వ్యక్తి తనకున్న లిమిటెడ్ ప్రోపర్టీస్ నీ ఎలా వాడేస్తాడో చూస్తే ఆశ్చర్యం గా అనిపిస్తుంది.

ఒకడు అందరికీ తను చేసిన మోసం తెలిస్తే భయపడేవాడు అయితే… అదే భయం తో డైరెక్ట్ పైకి పోతాడు లేదా దొరికిపోయి జైల్ కి పోతాడు.. భాస్కర్ లాంటి తెలివైనవాడు అయితే అతనికంటే తెలివైన అతని తండ్రితో కలిసి చావు తెలివితేటలతో బయటపడిపోతాడు.

కాస్త మంచితనం, ఫ్యామిలీ అంటే విపరీతమైన ఇష్టం, విసుగు తెప్పించే మధ్యతరగతి జీవితం, ప్రతీ ఒక్కరూ తనని మంచి అనుకోవాలనే తాపత్రయం ఇవన్నీ బుర్రలో తొలిచేస్తున్న కూడా కొంచెం కూడా తగ్గకుండా చివరివరకూ దొరక్కుండా బయటపడిపోవాలి అనుకునే సామాన్యుడి లా దుల్కర్ సల్మాన్ అద్భుతం గా చేశాడు.

అతని భార్య సుమతి గా మీనాక్షి వెరీ గుడ్.

భర్త తెచ్చే సంపాదన చూసి తెగ సంతోషపడే భార్య లా కాకుండా తప్పు చేస్తున్నావా అని అడిగే భార్య గా, రెస్పెక్ట్ కోరుకునే మంచి అమ్మాయిగా సుమతి లాంటి భార్య ఉంటే ఏ మగాడైనా తప్పు చెయ్యడానికి ఆలోచిస్తాడు చేస్తే సరిదిద్దుకుంటాడు కూడా…

సినిమాలో మర్చిపోలేని డైలాగ్స్ ..

ఆట గెలవాలి అంటే… కరెక్ట్ గా ఆడటం ఎక్కడ ఆపాలో తెలియాలి..
నేనిక్కడ బంగారం కొనడం కోసం కాదు వాడి అహంకారం మీద గెలవడం కోసం వచ్చాను
ఒకప్పుడు డబ్బు సంపాదన అవసరం అదిప్పుడు వ్యసనం నీకు..
ఒక్కరోజులో, 24 గంటల్లో ఒక అరగంట నాకు నచ్చినట్టుగా లేదని జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను..
నేను అబద్ధం చెప్పలేదు నిజాన్ని తెలివిగా దాచాను. (చెప్పాను)
దిస్ ఈజ్ ఇండియా.. వస్తువు కొనాలంటే డబ్బుతో కొనాలి.. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన వంటి మీద వస్తువుల రూపం లో కనపడాలి..
మోసం చేసిన వాడి మీద నార్మల్ గా మనకి కోపం రావాలి కానీ ఇక్కడ దుల్కర్ ఈ సమస్య నుండి బయటపడి పోవాలి అనుకుంటాం అదే సినిమా మ్యాజిక్..

బ్యాంక్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్, ఆర్థిక నేరాల కథలు ఇవన్నీ ఎప్పటికప్పుడు కొత్తగా చూపిస్తే ప్రతీ కథా ఒక పాఠమే. న్యాయంగా ఎదగాలనుకునేవాడికి… నేరం చేయాలనుకునే వాడికి ఇవేం పెద్ద అవసరం లేదు ఎందుకంటే వాడు ఆల్రెడీ ఫిక్స్డ్ .
ఎవరండీ ఈ వెంకీ అట్లూరి.. 90ల్లో నెల మొత్తం మనం బ్యాంక్ లో చేసిన లావాదేవీలు నెలాఖరుకు లోడ్ చేస్తారు.. అనే ఒక పాయింట్ తీసుకుని సినిమా మొత్తం అద్భుతం గా తీసాడు… లక్కీ భాస్కర్ సినిమా చాలా బావుంది. ధియేటర్ కి వెళ్లి చూడండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement