గత సంవత్సరం రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ సినిమా ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్ గా మిగిలింది. అయితే మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు విజయ్. తాజా అప్డేడ్ ప్రకారం తెలుగు హిట్ మూవీ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. గౌతమ్ చెప్పిన స్టోరీ లైన్ కు తాను ఎంతో ఇంప్రెస్ అయ్యానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు విజయ్.
అయితే, ప్రస్తుతం.. గౌతమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదికి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఎన్వీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో విజయ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.