Monday, September 9, 2024

VD12 | విజయ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్..

గౌతమ్ తిన్ననూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ అప్ క‌మింగ్ మూవీ విజయ్ 12. తాజాగా, ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని ప్ర‌క‌టించారు. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇక ఈ నెలలోనే మూవీ టైటిల్ కూడా రివీల్ చేయ‌నున్న‌ట్టు తెలిపారు మేక‌ర్స్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement