దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో హీరో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్డూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ గూఢాచారిగా కనిపించనున్నట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై ఎక్కడలేని హైప్ తీసుకొచ్చింది. పోలీస్ డ్రెస్‌లో మొహానికి ముసుగు ధరించిన పోస్టర్ అప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. అంతేకాకుండా.. నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి ..నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు అంటూ పోస్టర్‌పై ఓ క్యాప్షన్‌ను ఇచ్చి ప్రేక్షకుల్లో తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement