Monday, November 18, 2024

నేను దేన్నీ సీరియ‌స్ గా తీసుకోను – తొలిప్రేమ వాసుకి..

నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ ప్రధాన పాత్రల లో రూపొందిన ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంక దత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కీల క పాత్ర పోషించిన నటి వాసుకి మీడియా సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
తొలిప్రేమ తర్వాత దాదాపు 23 ఏళ్ళు తర్వాత మళ్లి కెమెరా ముందుకువచ్చారు?
తొలిప్రేమ తర్వాత చాలా అవకా శాలు వచ్చాయి. నాకు నచ్చిన అవకాశా లు కూడా వచ్చాయి. కానీ చేయడం నాకు కుదరలేదు. నేను అన్ని పనులు ఒకేసారి చేయలేను. ముం దు పిల్లలు, వాళ్ళ చదువులు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు. ఆనంద్‌గారు ఆయన పనిలో బిజీగా వుంటారు. ఇప్పుడు ఏదైనా చేయడానికి నాకు సమయం కుదిరింది.
ఇంతకాలం పరిశ్రమకు దూరంగా ఉన్న ఫీలింగ్‌ ఉండేదా?
లేదండీ. మా వారు ఆనంద్‌సాయి (ఆర్ట్‌ డైరెక్టర్‌) గారి వలన ఏదో ఒక సినిమా గురించి ఇంట్లో చర్చ జరుగుతూ వుంటు-ం ది.
యాక్టింగ్‌ కెరీర్‌ని ఎందుకు సీరియస్‌ తీసుకోలేదు ?
యాక్టింగ్‌ కాదు. నేను దేన్ని సీరియస్‌గా తీసుకోను. ఇదే మన దారి.. ఇదే చేయాలని అనుకోను.


ఈ చిత్రం అంగీకరించడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశా లు ఏమిటి ?
ఒక విరామం తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నామంటే మన కంఫర్ట్‌ జోన్‌ ముఖ్యం. తొలిప్రేమ చేసినప్పుడు నాకు 18 ఏళ్ళు. అప్పుడు డైలాగ్‌ రాకపోయి నా, తెలుగు రాకపోయినా, కొత్త స్థలమై నా..ఏదైనా ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతాం. ఈ ఏజ్‌లో రీఎంట్రీ- చే యాలంటే మాత్రం ఒక సేఫ్‌ అండ్‌ కంఫర్ట్‌ జోన్‌ చూస్తాం.
ఇందులో మీ పాత్ర ఎలా వుంటు-ంది ?
ఇందులో చాలా క్యూట్‌ సిస్టర్‌ పాత్రలో కనిపిస్తా…
అప్పుడు, మళ్ళీ ఇప్పుడు సిస్టర్‌ రోల్‌ ఏంటని అనిపిం చలేదా?
తల్లి పాత్ర ఇవ్వలేదు సంతో షించాలి. నిజానికి కథ బావుంటే తల్లి పాత్ర చేయడానికి కూడా రెడీనే.
ఈ సినిమాలో మీకు నచ్చిన పాయింట్‌ ఏమిటి ?
ఒక మంచి ఫెయిరీ టేల్‌ చదువుతున్నప్పుడు ఎంత ఆనందంగా హాయిగా వుంటు-ందో.. అన్నీ మంచి శకునములే అలా వుంటు-ంది.
యాదాద్రి నిర్మాణంలో ఆనంద్‌ గారి పని తీరుకి చాలా మంచి పేరు వచ్చింది. ఇందులో మీ పాత్ర ఎలా వుండేది?. ప్రాజెక్ట్‌ సంబంధించిన ప్రతి డెవలప్‌మెంట్‌ నాకు తెలుసు. ఆయన ప్రతిది చెప్పేవారు. యాదాద్రి ప్రాజెక్ట్‌ చేయడం మా కు దొరికిన భాగ్యం.అది చరిత్రలో నిలిచిపో తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement