హీరో వరుణ్ తేజ్ 13వ సినిమాగా తెరకెక్కుతోంది గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల కోసం అంతర్జాతీయ స్థాయి ట్రైనర్స్ వద్ద వరుణ్ తేజ్ సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం చాలా కష్టపడుతున్నారట. ఆయన అంకిత భావం మరియు పట్టుదల చూస్తే ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భారీ యాక్షన్ సినిమా స్టంట్స్ సన్నివేశాల కోసం హంగేరిలోని బుడా పెస్ట్ లో ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ ను త్వరలో మొదలు పెట్టబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. షూట్ కోసం రిహార్సల్స్ ను ఎక్కువగా చేస్తున్నారని.. తద్వారా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ స్పీడ్ గా అవుతుందని యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఓ ఫొటోని పోస్ట్ చేశారు మేకర్స్.
Advertisement
తాజా వార్తలు
Advertisement