Friday, November 22, 2024

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వాయిదా.. కారణం అదేనా?

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జూన్‌ 9న వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. వరుణ్‌ తండ్రి నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకకు చిరంజీవి, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌తోపాటు మెగా కుటుంబసభ్యులు పాల్గొని సందడి చేశారు. ఇక నిశ్చితార్ధం నాడే పెళ్లి ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు ఇరుకుటుంబాల పెద్దలు. మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి ఆగస్టు చివరి వారంలో ఉంటుందని కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది.

Varun Tej

అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు అలా జరిగేలా కనిపించడం లేదు. నిశ్చితార్థం తర్వాత పెళ్లి అంశం తెరపైకి వచ్చింది. ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశామని.. కానీ ఇప్పుడు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎంత‌ డెస్టినేషన్ వెడ్డింగ్ అయినా.. క‌నీసం పెళ్లి సంద‌డి క‌నిపించ‌డం లేదు. అసలు మెగా ఇంట పెళ్లి పనులు జరుగుతున్న హడావిడే లేదు. ఇక దీంతో పెళ్లి వాయిదా పడిందని అభిమానులు అనుకుంటున్నారు. అలాగే డేట్ మార్చడం వెనుక ఓ కారణం కూడా ఉందని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక ఇటీవలే విడాకులు తీసుకుంది. ఇది జరిగి కొన్ని రోజులే అవుతోంది.. దీంతో మళ్లీ వెంటనే ఇంట్లో శుభకార్యమంటే అంతగా బాగోదని, అందుకే పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం విడాకుల డిప్రెషన్ నుంచి నిహారిక కోలుకుంటుంది. ఇంట్లో పరిస్థితి కాస్త మెరుగుపడిన తర్వాత ముహూర్తాలు చూసి పెళ్లి చేయాలని నాగబాబు భావిస్తున్నారని టాక్‌.. నవంబర్-డిసెంబర్‌లో వరుణ్-లావణ్యల పెళ్లి జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి వార్తా బయటికి రాలేదు. కొన్నాళ్లు ఆగితే ఏ విషయమనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ వేచిచూడవల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement