Friday, November 22, 2024

లేడీస్ తో డాన్స్…వర్మ రియాక్షన్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. వర్మ ఏం చేసినా ఏం మాట్లాడినా అది వివాదమే అవుతుంది. అయితే ఇటీవల వర్మ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ వీడియో లో వర్మ లేడీస్ తో చిందులు వేస్తూ కనిపించారు. అయితే ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేయగా…వర్మ తాజాగా దానిపై స్పందించారు.

వీడియోను షేర్ చేస్తూ… ఆర్జీవీ అందులో ఉన్నది నేను మాత్రం కాదు అంటూ కామెంట్ చేశాడు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రచ్చపై స్పందించారు. అసలు మీరు అమ్మాయితో అలా డ్యాన్స్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా అనే ప్రశ్నకు నీకేం నొప్పి.. మేము ఇద్దరం మేజర్లం… మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం. మధ్యలో మీకేంటి… అంతేకాకుండా ఆ అమ్మాయితో ఉన్న పిక్ ను షేర్ చేసి ఆ అమ్మాయి నాతో ఇబ్బంది పడుతున్నట్లు కన్పిస్తుందా ఆమె సంతోషంగా ఉంది. నేను కూడా సంతోషంగా ఉన్నాను ఆక్కడ ఉన్నవాళ్లు కూడా ఆనందంగా ఉన్నారు. మధ్యలో వాళ్లెవరికో ప్రాబ్లెమ్ ఏంటి అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement