రాంగోపాల్ వర్మ గురించి ఏం చెప్పినా తక్కువే….నిత్యం ఏదో ఒక సంచలనం రేపుతూ ట్వీట్ లు చేస్తూ ఉంటాడు. మరోవైపు హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ ఉన్నాడు. అయితే కరోనా టైం లో కూడా సినిమాలు చేసి సొమ్ము చేసుకున్నాడు వర్మ. పవర్ స్టార్, క్లైమాక్స్, నగ్న ,కరోనా వైరస్ వంటి సినిమాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో కూడా సొమ్ము చేసుకోడానికి రెడి అవుతున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ స్పార్క్ ను ప్రారంభించాడు. ఇది మే 15 నుంచి అందుబాటులోకి రానుంది. దీని గురించి తన టీం తోపాటు స్టార్స్ ని ఇన్వాల్వ్ చేసి ప్రచారం చేస్తున్నాడు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కి కావలసిన బజ్ తీసుకొస్తున్నాడు. మరి వర్మ ఈ ఓటీటీ తో ఈ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.