విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తన చిరకాల మిత్రుడు, గ్యాలరీస్ట్ నికోలాయితో ఇవ్వాల ముంబయిలో నిశ్చితార్థం చేసుకుంది. ఇరు ఫ్యామిలీలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బయటకు రాగా అవి వైరల్గా మారాయి. వరలక్ష్మి ఎంగేజ్మెంట్ ఫొటోలు చూసిన అభిమానులు, నేటిజన్లు.. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, ముంబయికి గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్తో వరలక్ష్మి 14 ఏళ్లుగా పరిచయం ఉందట. ఇండస్ట్రీకి పెద్దగా సంబంధం లేని వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతుంది. కాగా, వరుడుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.