మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గ్రాండ్ హిట్ తో మార్కెట్ లో తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు ఈ మూవీ ఇవాళ్టి నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో స్ట్రీమ్ కానుంది. ఏప్రిల్ 9న విడుదలయి ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. 85 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తెలుగులో బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా నిలిచింది. గతంలో అత్తారింటికి దారేది చిత్రం 82 కోట్లు వసూలు చేస్తే, ఇప్పుడు వకీల్ సాబ్ ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. అయితే కరోనా వలన ఈ సినిమా కలెక్షన్స్‌కు భారీ గండి పడింది. లేదంటే వకీల్ సాబ్ అప్పటికే 100 కోట్ల మార్క్ ని టచ్ చేసేవాడని సినీ వర్గాలు అంటున్నాయి. తొలి వారం వకీల్ సాబ్ థియేటర్స్ అన్ని హౌజ్ ఫుల్ కాగా, రెండో వారానికి పరిస్థితులు అన్ని తారుమారు అయ్యాయి. కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో జనాలు థియేటర్స్‌కు రావడమే మానేశారు. దీంతో చేసేదం లేక వకీల్ సాబ్ చిత్రాన్ని ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. 50 రోజుల తర్వాత వకీల్ సాబ్‌ను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు కాని, పరిస్తితుల వలన ముందే స్ట్రీమిగ్ చేయక తప్పలేదు.
నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వకీల్ సాబ్..
- Tags
- breaking news telugu
- Cinema News
- latest breaking news
- latest news telugu
- latest telugu movies
- MOVIE NEWS
- pavan kalyan
- telugu breaking news
- Telugu Cinemas News
- Telugu Daily News
- telugu epapers
- telugu latest news
- telugu movie news
- Telugu New Movies
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- VAKEEL SAAB
- viral news telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement