అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా వచ్చేసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం థియేటర్లో సందడి చేసింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు నివేద థామస్, అంజలి, అనన్య కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం పై రకరకాల టాక్స్ బయటకు వస్తున్నాయి. ఇక కథ విషయానికి వస్తే జరీనా (అంజలి) పల్లవి (నివేదా) అనన్య ముగ్గురు స్నేహితులు. ముగ్గురు కూడా మిడిల్ క్లాస్ అమ్మాయిలు. హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు రాత్రి పార్టీ నుండి క్యాబ్ లో వెళుతూ అనుకోకుండా విలన్ వాళ్ళ రిసార్ట్ కి వెళ్తారు. అక్కడ జరిగిన ఒక సంఘటన వాళ్ళ జీవితాలను పూర్తిగా మలుపు తిప్పుతుంది. వీళ్ళ పై కోర్టులో కేసు అవుతుంది.
మరోవైపు ఏ దిక్కు లేని ఈ అమ్మాయిల పక్షాన నిలబడతాడు వకీల్ సాబ్ సత్యదేవ్. ఈ అమ్మాయిలకు ఎలాంటి న్యాయం చేస్తాడు ప్రత్యర్థి లాయర్ అయిన నందా ను ఏ విధంగా ఢీ కొంటాడు ఇంతకీ వకీల్ సాబ్ ఎందుకు తాగుడు అలవాటు చేసుకుని జీవితంలో ఒంటరిగా మిగిలిపోతాడు అనేదే ఈ సినిమా స్టోరీ.
ముఖ్యంగా సినిమా బలాబలాల విషయానికొస్తే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ తన యాక్టింగ్ తో అందర్నీ కట్టి పడేసాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో కూడా పవన్ సరి కొత్తగా కనిపించాడు. శృతిహాసన్ చనిపోయే సమయంలో లో, మరోవైపు కోర్టు సన్నివేశాలలో కన్నీళ్లు పెట్టే సన్నివేశాలు పవన్ ను మరో ఎత్తు తీసుకెళ్లాయి. అలాగే పవన్ చెప్పిన డైలాగులు కూడా థియేటర్స్ లో గోల పెట్టించాయి. అలాగే అంజలి నివేదాథామస్ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా నివేదా థామస్ నటన హైలెట్ అని చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే తన స్టైల్లో చేశారు.
ఇక దర్శకుడి విషయానికొస్తే పవన్ ను చూపించే విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా కోర్టులో జరిగిన కొన్ని నాటకీయ అంశాలను సమాజంలో స్త్రీల పై కొన్ని సందర్భాలలో జరుగుతున్న పరిస్థితులను దర్శకుడు వేణు శ్రీరామ్ అద్భుతంగా చూపించారు. మొత్తంగా చూసుకుంటే పేదలకు న్యాయం చేయడానికే వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ అద్భుతం. సినిమాలో పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకునే విధంగా కొన్ని అంశాలు ఉన్నాయి. అలాగే మంచి మెసేజ్ కూడా ఉండటంతో ఓవరాల్ గా ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా బాగా అకట్టుకుంటుంది. పవన్ ఫ్యాన్స్ కి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.