Tuesday, November 26, 2024

సూపర్ ఉమెన్ పేరు పవన్ కళ్యాణే పెట్టారు… సరళాదేవి

వకీల్ సాబ్ సినిమా లో కోర్టు సీన్ ఒకటి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మహిళా ఎస్ ఐ గా ఈ సినిమాలో నటించిన సరళాదేవి ఆ ఒక్క సీన్ తోనే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇదే విషయమై ఆమె మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ అంటే నాకు చెమటలు పడతాయి. ఆయన పేరు చెబితేనే భయం మొదలవుతుంది. కానీ సార్ గురించి ఏదో అనుకుంటారు. నిజానికి ఆయన చాలా సింపుల్ గా ఉంటారని చెప్పుకొచ్చింది సరళాదేవి. సూపర్ ఉమెన్ అంటూ పేరు రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ అని ఆ డైలాగ్ బాగా పేలింది అంటే పవన్ కళ్యాణ్ గారివల్లేనని తెలిపింది.

నిజానికి సినిమాలో ఆ డైలాగ్ లేదు. ఆమెను ఏదైనా స్పెషల్ గా పిలవాలి అని చెప్పేసి సూపర్ ఉమెన్ అన్నారు. ఆ పదం ఆయన నుంచి అప్పటికప్పుడు వచ్చింది. పవన్ కళ్యాణ్ స్టైల్ లో సూపర్ ఉమెన్ అని అంటుంటే ఎంజాయ్ ప్రేక్షకులు చేస్తున్నారు. కానీ ఆ సీన్ జరుగుతున్నప్పుడు నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నా. పవన్ కళ్యాణ్ సార్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటే డైలాగ్ చెప్పలేకపోయాను. ఆయన కళ్లలోకి చూసేసరికి ఆ డైలాగ్ మర్చిపోయా. అందుకే ఆయన ఏంటమ్మా గురాయించి చూస్తున్నావ్ అనే డైలాగ్ వేశారు. నిజానికి ఆ డైలాగు కూడా స్క్రిప్ట్ లో లేదు. ఆయన డైలాగ్ చెప్పగానే నేను నిజంగానే అలా చూస్తున్నానా అనుకుని వెంటనే నవ్వేసాను అంటూ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement