Tuesday, September 17, 2024

Wishes | పవన్ కల్యాణ్ కు ఉస్తాద్ భగత్‌సింగ్ పోస్టర్ గిఫ్ట్

ఏపీలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్ర‌మాణం చేశారు. కాగా, ప‌వ‌న్ నోటివెంట ‘పవన్ కల్యాణ్ అనే నేను’ మాట వినగానే సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఈ మాట కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జనసేన సైనికులు, సినీ అభిమానుల కోరిక ఈరోజు నెరవేరింది.

కాగా, పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పవర్ స్టార్, హరీశ్ శంకర్ కాంబోలో తెర‌కెక్క‌తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ యూనిట్ అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేసింది. పోలీస్ యూనిఫాం వేసుకొని చేతిలో సుత్తి పట్టుకుని ఉన్న పవన్ స్టిల్ సింప్లీ సూపర్‌గా ఉంది. ఇక ఈ పోస్టర్‌లో ‘సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అనే క్యాప్షన్ కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement