మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో పాటు పలు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేయడం ద్వారా సౌత్ ప్రేక్షకులకు సుపరిచితం అయిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడు మోడల్ గా కెరీర్ ను ఆరంభించి ఎన్నో సినిమాల్లో మరియు కమర్షియల్స్ లో నటించి మెప్పించింది.
మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్ ను గెలుచుకున్న నేపథ్యంలో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. మిస్ యూనివర్స్ 2015 లో ఛాన్స్ సొంతం చేసుకోలేక పోయింది. అయితే సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా మరోసారి నెట్టింట షేర్ చేసిన అందాల ఫోటో షూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పింక్ డ్రెస్ లో విభిన్నమైన లుక్ తో చూపరులను కట్టిపడేస్తుంది. సాధారణంగా పింక్ లో ముద్దుగుమ్మలు మరింత అందంగా కనిపిస్తారు అంటారు. ఈ ఫోటోలను చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బాస్ పార్టీ బ్యూటీ పింక్ అందాలను మీరు ఒక లుక్కేయండి.