బాలీవుడ్ బ్యూటీ ఏజెంట్ చిత్రంలో ఐటెంసాంగ్ లో మెరిసింది. వైల్డ్ సాలా అంటూ సాగిన ఆ పాటకు మంచి రెస్పాన్స్ దక్కింది.హీరో అఖిల్ .. ఊర్వశిల డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.వెండి తెర పై ఈ జోడీని చూసి ప్రేక్షకులు కూడా సర్ ప్రైజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని కూడా మెప్పించే విధంగా ఆ ఐటం సాంగ్ నిలిచింది అనడంలో సందేహం లేదు. ఆ ఐటం సాంగ్ లో హీరోయిన్ ఊర్వశి రౌతేలా ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.ఏజెంట్ మేకర్స్ ఊర్వశి కోసం ఆ కాస్ట్యూమ్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. న్యూయార్క్ రెట్రో ఫ్రెట్ బ్రాండ్ లో ఊర్వశి లుక్ కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఐటం సాంగ్ లో ఆమె ఔట్ ఫిట్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది. అంతటి స్పెషల్ కాస్ట్యూమ్ కి ఏకంగా రూ.20 లక్షలు ఖర్చు చేసి డిజైన్ చేయించారని తెలుస్తోంది.సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. సాక్షి వైద్య పాత్ర కు ఎంత ప్రాముఖ్యత దక్కిందో అదే స్థాయిలో ఊర్వశి రౌతేలా యొక్క ఐటం సాంగ్ కు ప్రాముఖ్యత దక్కిందని దీన్ని బట్టి అర్థం అవుతుంది.కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన సినిమా ఏజెంట్.
Advertisement
తాజా వార్తలు
Advertisement