Friday, November 22, 2024

Urfi Javed | ప‌బ్లిసిటీ కోస‌మే అరెస్ట్ డ్రామా.. ఈసారి నిజంగానే కేసు నమోదు చేసిన ముంబై పోలీస్

సోష‌ల్ మీడియాలో త‌న తన విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది బాలీవుడ్ భామ ఉర్ఫీ జావేద్. డ్రెస్సులు, బ్లేడ్లు, కవర్లు, గోనె సంచులు, సిమ్ కార్డులు, తాళ్లు… ఇలా రకరకాల వస్తువులతో డ్రెస్సులు వేస్తూ బాగా ఫేమస్ అయింది. అశ్లీల, అసభ్య రీతిలో దుస్తులు ధరిస్తున్నారనే ఆరోపణలపై ఆమెను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఎప్పటిలాగే ఓ కొత్త రకం డ్రెస్ వేసుకొని కాఫీ తాగడానికి బయటకి వచ్చింది ఉర్ఫి.

అంతలో కొంతమంది మహిళా పోలీసులు కాఫీ షాప్ వద్దకు వచ్చి రోడ్డు మీదే ఉర్ఫి జావేద్‌ని అదుపులోకి తీసుకొని తమ పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలని కాసేపు హడావిడి చేసింది ఉర్ఫి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై ముంబై పోలీసులు స్పందించారు.

అయితే, ఈ విష‌యంపై ముంబై పోలీసులు స్పందించారు. నిన్న జ‌రిగిన ఉర్ఫీ అరెస్ట్ ఫేక్ అంటూ తేల్చేశారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ముంబై పోలీసులు.. ఉర్ఫీ జావేద్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దాంతో పాటు ఆమెని అరెస్ట్ చేసిన ఫేక్, పోలీసులని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

‘‘చీప్ పబ్లిసిటీ కోసం చట్టాల్ని ఉల్లంఘించకూడదు. ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఒక వీడియో వైరల్ అయింది. అయితే ఆ వీడియో అంతా ఫేక్. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఫేక్. పబ్లిసిటీ కోసం ఈ వీడియో చేశారు. దీంతో ఆమెపై, పోలీస్ డ్రెస్, వెహికల్ మిస్ యూజ్ చేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాం. ఇప్పటికే ఆ పోలీస్ వెహికల్ సీజ్ చేసి, పోలీస్ డ్రెస్ లో ఉన్నవారిని అరెస్ట్ చేశాం. మిగతా విచారణ చేస్తున్నాం. 171, 419, 500, 34 IPC సెక్షన్స్ పై ఆ మహిళపై క్రిమినల్ కేసు నమోదు చేశాము అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement