Friday, November 22, 2024

నాంది కంటే ఉగ్రం మూవీని ప‌దిరెట్లు ఆదిరిస్తారు – అల్ల‌రి న‌రేష్

‘నాంది’ సినిమాతో విజయం అందుకున్న హీరో అల్లరి నరేష్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల కలిసి చేస్తున్న మరో చిత్రం ఉగ్రం. ఈ చిత్రాన్ని షైన్‌ స్కీన్స్ర్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్‌ కథానాయిక. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఉగ్రం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. హీరోలు అడివి శేష్‌, నిఖిల్‌, సందీప్‌ కిషన్‌, విశ్వక్‌ సేన్‌, దర్శకులు హరీష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి శివ నిర్వాణ, విఐ ఆనంద్‌, వశిష్ట ఈ వేడుకకు హాజరయ్యారు.
హీరో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ”ఉగ్రం నా 60వ సినిమా. ఈ జర్నీలో చాలా మంది దర్శకులు, రచయితలు, నిర్మాతలు వున్నారు.

ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. నాందికి పని చేసిన టీ-ం దాదాపుగా ఉగ్రంకి పని చేశాం. విజ య్‌, నేను ఈ సినిమా అనుకున్నప్పుడే నాందికి మించి వుండా లని భావించాం. ఆ అంచనాలని అందుకోవడానికి నాతో పాటు- విజయ్‌, సిద్‌, అబ్బూరి రవి గారు, శ్రీచరణ్‌ .. అందరూ కష్టపడి పని చేశాం. మిర్నా చక్కగా నటించింది. మా నిర్మాతలు సాహు , హరీష్ ఎక్కడా రాజీపడకుండా చేశారు. ఉగ్రం కోసం 73 రోజులు రోజుకి దాదాపు పదహారు గంటలు పని చేశాం. ఫైట్‌ మాస్టర్‌ రామకృష్ణ మాస్టర్‌, ప్రథ్వీ మాస్టర్‌ వెంకట్‌ మాస్టర్‌ .. హై ఇం-టె-న్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ లు డిజైన్‌ చేశారు. ఇందులో ఆరు ఫైట్లు- వుంటాయి. ఇప్పటి వరకు మీకు కితకితలు పెట్టాను. కొన్నిసార్లు ఎమోషన్‌ చేశాను. కానీ ఇందులో ఉగ్రరూపం చూడబోతున్నారు. ఇందులో ఇం-టె-న్స్ నరేష్‌ ని చూస్తారు. నాందిని గొప్పగా ఆదరించారు. దానికంటే కంటే పదిరెట్లు- ఈ సినిమాని ఆదరిస్తారని ఆదరిం చాలని కోరుకుంటు-న్నాను.అని అన్నారు. నిఖిల్‌ మాట్లాడు తూ ”ఉగ్రం -టైలర్‌ చూస్తునపుడు గూస్‌ బంప్స్‌ వచ్చాయి. నరేష్‌ అన్నకి మెసేజ్‌ పెట్టాను. ఉగ్రం బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది అని అన్నారు.

చిత్ర దర్శకుడు విజయ్‌ కనకమేడల మాట్లాడుతూ ”బ్రహ్మ కడలి గారు అద్భుతమైన ఆర్ట్‌ వర్క్‌ చేశారు. సిద్‌ బ్రిలియంట్‌ విజువల్స్‌ ఇచ్చారు. శ్రీచరణ్‌ పాకాల ఆర్‌ఆర్‌ చేశా రు. తూమ్‌ వెంకట్‌ నేను ఎప్పటి నుంచో స్నేహితులం. తనతో మరిన్ని మంచి కథలు చేయాలని వుంది. అబ్బూరి రవి గారికి కృతజ్ఞతలు. ఎడిటర్‌ చోటా కే ప్రసాద్‌ నాకు ఒత్తిడి లేకుండా చూసుకున్నారు. భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్‌ చాలా చక్కన్ని సాహిత్యం అదించారు. నా డైరెక్షన్‌ టీ-మ్‌కి, ఈ చిత్రంలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మా నిర్మాతలు సాహు, హరీష్‌ గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నరేష్‌ గారు నాందితో నన్ను నమ్మేశారు. అన్నారు. నిర్మాత హరీష్‌ పెద్ది మాట్లాడుతూ దర్శకుడు విజయ్‌ డిక్షనరీలో రాజీ అనే పదమే లేదు. కావాల్సింది సాధించేవరకూ నిద్రపోడు. మేము ఆయ న మీద పెట్టు-కున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. అని చెప్పారు.

నిర్మాత సాహు మాట్లాడుతూ.. మేము ఎంత థ్రిల్‌ అయ్యా మో ఆడియన్స్‌గా మీరూ అంత థ్రిల్‌ అవుతారు.అని అన్నారు.
తూమ్‌ వెంకట్‌ భాస్క ర భట్ల, చైతన్య ప్రసాద్‌, బ్రహ్మ కడలి, చోటాకే ప్రసాద్‌, సుభాస్‌, రమేష్‌ రెడ్డి, నాగ మహేష్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement