సూపర్ స్టార్ రజినీకాంత్‌కు యూనైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను జారీ చేసింది. గోల్డెన్ వీసా జారీ చేసినందుకు, తనకు లభించిన గౌరవానికి ప్రభుత్వానికి రజినీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈ కల్చరల్ డిపార్ట్మెంట్ ఆయనకు ఈ వీసాను అందజేసింది. ఆయన ఇటీవల అబుదాబీని సందర్శించారు.
ఆయన వెంట లూలు గ్రూప్ ఛైర్మన్ ఏంఏ యూసఫ్ ఆలీ కూడా ఉన్నారు. అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, అబుదాబి ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఛైర్మన్ మహ్మద్ ఖలీఫా అల్ ముబారక్ యూసఫ్ గోల్డెన్ వీసాను రజినీకాంత్‌కు అందించారు. అబుదాబి పర్యటనలో రజినీకాంత్ లూలూ గ్రూప్ ఛైర్మన్‌తో పాటు, ఆయన కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లతోనూ సమావేశమయ్యారు.
ఈ పర్యటనలో ఆయన లూల గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ నివాసంలోనే బస చేశారు. రజినీకాంత్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. గోల్డెన్ వీసా అందుకునేందుకే ఆయన యూఏఈకు వెళ్లారు. రజినీకాంత్, అమితాబచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటితో కలిసిన నటించిన సినిమా అక్టోబర్‌లో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలోనూ రజినీ నటిస్తున్నారు.