చిరుత బ్యూటీ నేహాశర్మ అదృశ్యం చాలా కాలం పాటు టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. మొదటి సినిమా చిరుత రిలీజయ్యాక నేహా మళ్లీ ఇక్కడ కనిపించలేదు. అయితే ఈ బ్యూటీ కేవలం హిందీ చిత్రసీమకు పరిమితమై తెలుగులో మళ్లీ నటించలేదు. దానికి కారణాలపైనా ఆరాలు కొనసాగాయి.
అదంతా అటుంచితే నేహాశర్మ బాలీవుడ్ కెరీర్ కూడా అంతంత మాత్రమే. అదే క్రమంలో ఈ బ్యూటీ రాజకీయాల్లోకి వస్తోంది! అంటూ ప్రచారమైంది నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ బీహార్లోని భాగల్పూర్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో నేహా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. కానీ నేహా శర్మ పార్టీ ప్రచారానికే పరిమితమైంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే నేహాశర్మ తన సోదరి ఐషా శర్మతో కలిసి టాప్ బ్రాండ్స్ కి ప్రమోటర్ గా కొనసాగుతోంది. తాజాగా ముంబై శాంటా క్రజ్ ఏరియాలో ఒక స్టోర్ లాంచ్ లో తన సోదరి ఐషాతో కలిసి నేహా పాల్గొంది. అందుకు సంబంధించిన ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. బాలీవుడ్ కి చెందిన పలువురు నటీమణులు ఈ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనగా శర్మా సిస్టర్స్ డామినేషన్ అక్కడ స్పష్ఠంగా కనిపించింది. నేహా- ఐషా సిస్టర్స్ టూ హాట్ లుక్ తో గుబులు పెంచారు. నేహా బ్లాక్ ఇన్నర్ టాప్ ని ధరించగా, ఐషా బ్లూ థై స్లిట్ ఫ్రాక్ లో గుబులు రేపింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.