Sunday, September 22, 2024

Copy | దేవ‌ర్ సాంగ్ పై ట్రోలింగ్…

దేవర నుంచి సెకండ్ సింగిల్ ‘చుట్టమల్లే’ అనే సాంగ్ ను నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. రొమాంటిక్ గా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఈ పాటకి ఓ వర్గం ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. చాలా కాలం తర్వాత ఓ మంచి విరహగీతాన్ని వింటున్నామని మరికొందరు సంగీత ప్రియులు అంటున్నారు. తెలుగులోనే ఇప్పటి వరకు ఈ సాంగ్ ని కోటిమందికి పైగా వీక్షించారు.

అయితే ఒక వర్గం దీనిని కాపీ క్యాట్ సాంగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు. అనిరుద్ కూడా వేరొక సాంగ్ ట్యూన్స్ లేపేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దేవర పాటకి సంబందించిన ఒరిజినల్ ట్యూన్ శ్రీలంకకి చెందిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ నుంచి కాపీ చేశారని ట్రోల్ చేస్తున్నారు.’మనికే మగే హీతే’ అనే ఆ పాటను దేవర పాటకు జత చేసి అచ్చం ఒకే తరహాలో రెండు పాటల ట్యూన్స్ లిరిక్ స్టైల్ ఉన్నాయని అంటున్నారు.

అయితే సాంగ్ ఎలా ఉన్న మెలోడియస్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యిందని ఎన్టీఆర్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఈ ట్రోలింగ్ అనేది ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ రెగ్యులర్ గా ఫేస్ చేసేదే. ప్రతి హీరోకి అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కి యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉంటారు. వీరు పనిగట్టుకొని కేవలం సినిమా ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారనే మాట సోషల్ మీడియాలో మరో వర్గం కౌంటర్ ఇస్తోంది.

అయితే, గతంలో ఈ కాపీ ఆరోపణలు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సాంగ్స్ కి వచ్చాయి. సిమిలారిటీగా ట్యూన్ ఉందంటే దానిని వెంటనే కాపీ సాంగ్ అంటూ ట్రోల్స్ చేసేవారు. రాబోయే రోజుల్లో సంగీత దర్శకులకు ఇదొక పెద్ద చాలెంజ్ అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement