Monday, September 23, 2024

Tirumala | త్రివిక్ర‌మ్ కూడా మొక్కు తీర్చేశాడు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం టాలీవుడ్ లోని సినీ ప్రముఖులు ,అభిమానులు, మెగా కుటుంబం ఎంతో అండగా నిలిచారు. దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ కు మంచి స్నేహితుడన్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ తో త్రివిక్రమ్ కు మంచి బాండింగ్ వుంది.

పవన్ రాజకీయాలలో చురుకుగా పాల్గొనడంలో త్రివిక్రమ్ పాత్ర ఎంతో వుంది. పవన్ గెలుపుకోసం త్రివిక్రమ్ తన పూర్తి మద్దతు అందించారు. తాజాగా పవన్ కల్యాణ్ అఖండ విజయం సాదించడంతో త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. .ఇవాళ ఉదయం వీఐపి దర్శన సమయంలో త్రివిక్రమ్ స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement