సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లి వార్తలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు ఈ అమ్మడు పెళ్లి గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా మరోసారి తన పెళ్ళికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. త్వరలోనే త్రిష ఓ తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు.
ఇక తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన త్రిషకు ప్రస్తుతం అవకాశాలు పెద్దగా రావట్లేదు. కాగా కొన్నాళ్ళ క్రితం త్రిష వ్యాపారవేత్త వరుణ్ మానియన్ తో పెళ్లికి సిద్ధమైంది. ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ ఆ తర్వాత ఆ పెళ్ళిని ఇద్దరూ క్యాన్సల్ చేసుకున్నారు.