Tuesday, November 26, 2024

Train accident.. ర‌క్త‌దానం చేయాల‌ని ఫ్యాన్స్ ని కోరిన చిరంజీవి

ఒడిశాలో జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పొయిన బాధిత కుటుంబాల‌కి సానుభూతి తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. గాయపడిన వారికి చికిత్స కోసం భారీగా రక్తం అవసరం అవుతుందని.. వారి ప్రాణాలు కాపాడేందుకు బ్లడ్ యూనిట్స్ ఆవశ్యకత ఉందన్నారు. కాబట్టి ఘటనాస్థలికి దగ్గర‌లో ఉన్న తన ఫ్యాన్స్ వెంటనే వెళ్లి రక్తదానం చేయాలని చిరంజీవి కోరారు. ఈ విషాదకర ఘటన గురించి తెలియగానే తాను షాక్​కు గురయ్యానన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. గాయాలపాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మన దేశ రైల్వే చరిత్రలో అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో జరిగినట్లుగా చెబుతున్న ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఆ స్పీడులో పట్టాలపై ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది. దీన్ని బట్టి ప్రమాద తీవ్రతను ఊహించుకోవచ్చు. వేగంగా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement