టాలీవుడ్లో విషాదం చోటుచేసుంది…. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ బలవన్మరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వప్ప మాదాపూర్‌లో ఒంటరిగా నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే స్వప్ప ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
స్వప్న వర్మ మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి సినిమా రంగంలో పని చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. ఈ క్రమంలో పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న ఆమె గతేడాది నుంచి మాదాపూర్ కావేరి హిల్స్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటోంది.
అయితే గత ఆరు నెలలుగా ఏ ప్రాజెక్ట్ రాలేదు. దీంతో ఒత్తిడికి గురైన స్వప్న రెండు రోజుల క్రితం తాను నివసిస్తున్న ప్లాట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.