కింగ్ నాగార్జున హీరోగా సోలొమన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వైల్డ్ డాగ్. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జున ఈ చిత్రాన్నే నమ్ముకున్నాడు. కాగా ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథ విషయానికి వస్తే ఎన్ఐఏ సీనియర్ ఆఫీసర్ గా విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపిస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల నాగార్జునను సస్పెండ్ చేస్తారు. కానీ పూణే లో జరిగిన ఓ బాంబ్ బ్లాస్ట్ కేసు అంతుచిక్కకుండా ఉంటుంది. దానిని ఛేదించేందుకు విజయ్ వర్మ ను రంగంలోకి దించుతారు అధికారు. అయితే ఆ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే మరోసారి సస్పెండ్ చేస్తారు. అసలు విజయ్ వర్మ ను మళ్ళీ ఎందుకు సస్పెండ్ చేశారు… కేసు పరిశీలిస్తున్న సమయంలో ఏం తెలిసింది. .. అసలు దొంగ ఎవరు ? అనే ఆసక్తికర అంశాలను ఆధారంగా చిత్రం నడుస్తుంది.
ఫస్టాఫ్ మొత్తం విజయ్ వర్మ కూతురు బాంబు బ్లాస్ట్ లో చనిపోవడం… దియా మీర్జా తో ఎమోషనల్ సీన్స్ అలా మొదటి భాగం నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా అసలు కథ మొదలవుతుంది. బాంబు బ్లాస్ట్ కారణమైన వాళ్ళని పట్టుకునేందుకు నేపాల్ వెళ్లడం అక్కడ టీంకు ఎదురైనా సమస్యలు ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ తీసుకొస్తాయి. చివర్లో ఇచ్చిన ట్విస్టు మాత్రం సగటు సినీ ప్రేక్షకుడి అందరినీ ఆకట్టుకుంటాయి.
సినిమా మొత్తానికి సెకండ్ ఆఫ్ మెయిన్ అనే చెప్పాలి. విజయ్ వర్మ పాత్రలో నాగార్జున తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన వారు కూడా వారి వారి పాత్రల్లో మంచిగా నటించారు. హీరోయిన్ దియా మీర్జా, అలీ రాజా, అవినాష్ కురువిల్లా ,మయాంక్ ,ప్రకాష్, సయామిఖేర్ ఇలా అందరూ వారి వారి పాత్రలలో ఆకట్టుకున్నారు.అలాగే వైల్డ్ డాగ్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ముఖ్యమైనవి. వాటిని చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లొకేషన్స్ కూడా బాగానే చూపించారు. మరోవైపు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే వైల్డ్ డాగ్ సినిమా కొంతమందికి మాత్రమే నచ్చుతుంది. మాస్ ఆడియన్స్ కు అంతగా కిక్ ను ఇవ్వలేకపోయిందనే చెప్పాలి.