Sunday, September 8, 2024

ఇండియ‌న్-2లో నెగిటివ్ షేడ్స్‌లో క‌నిపించ‌నున్న టాలీవుడ్ కమెడియన్!

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ రీసెంట్ మూవీ విక్ర‌మ్.. క్రైమ్ త్రిల్ల‌ర్ యైనివ‌ర్స్ గా తెర‌కెక్కిన ఈ సినిమా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. కాగా, విక్రిమ్ త‌రువాత.. చాలా రోజుల‌నుంచి పెండింగ్ లో ఉన్న‌ ప్రాజెక్ట్ ఇండియ‌న్ 2 షూట్ ని ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు క‌మ‌ల్. ఏస్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో టాలీవుడ్ లోని ఫేమ‌స్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా భాగమని తాజా సమాచారం. ఇండియ‌న్ 2లో వెన్నెల కిషోర్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

పాన్-ఇండియన్ మూవీలో పెళ్లి త‌రువాత సినిమాల‌కు బ్రెక్ ఇచ్చిన‌ కాజల్ అగర్వాల్ కథానాయికగా న‌టిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండ‌గా.. లైకా ప్రొడక్షన్స్ అండ్ రెడ్ జెయింట్ మూవీస్ క‌లిసి ఈమూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement