హిందీ రీమిక్స్.. సినీరంగంలో ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్న డీజే అమిత్ సక్సేనా తాజాగా తెలుగు సినీ ప్రపంచంలో సైతం తన సంగీతంతో ప్రజలను మంత్రముగ్దులను చేస్తున్నారు… తెలుగులో మొట్ట మొదట అల వైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ పాటకు చేసిన రిమిక్స రికార్డు సృష్టించింది… యూట్యూబ్‌లో దానిని 4లక్షల మందికి పైగా చూశారంటే అది ఎంతటి సక్సెస్ సాధించిందో చెప్పవచ్చు… బ్లాక బ్లాస్టర్ ఎంట్రీతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరపురాని గీతాన్ని అందించారు…
దశాబ్దకాలానికి పైగా అమిత్ సక్సెనా తన రీమిక్స్.. సంగీతంలో హిందీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు… తెలుగులో తాను చేసిన ఈ పాట రీమిక్స అత్యధిక పాపులర్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు… భవిష్యత్‌లో మరిన్ని సినిమాలకు రిమిక్స అందించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు…
దశాబ్ద కాలంగా బాలీవుడ్ గుర్తింపు..
డీజే అమిత్ సక్సెనా దశాబ్దకాలానికి పైగా హింది సినిమా రంగంలో అనేక ప్రయోగాలు చేశారు. పాటలకు రీమిక్స్‌తో పాటు కొత్త తరహా సంగీత విభావరులకు ప్రాణం పోశారు. ఆయన చేసిన అనేక రీమిక్స్ హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. షేర్‌షా సినిమాలోని రాథాన్ లాంబియాన్, కాళీబాలి, చోగ్‌డా, దేషి గర్ల్, హుస్న్‌హైసహనా, టిప్‌టిప్ బర్సాపానీ, ఓ సనమ్, డ్యాన్స్ బసంతి తదితర అనేక హిందీ రీమిక్స్‌కు ప్రాణం పోశారు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన అనేక కార్యక్రమాలు అత్యంత ప్రజాధరణ పొందాయి. ఐపీఎల్, 2013, 2016, ఐసీసీ టీ-20, ఇండియన్ బ్యాడ్మింటెన్ తదితర అనేక క్రీడా వేదికలను ఆయన సంగీతంతో ఉర్రూతలూగించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.