ఈ మధ్య కాలంలో పలు చిత్రాలు రీ రిలీజ్ అయి హిట్ గా నిలిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ-రిలీజ్‌కు కానుంది.. మే 31న ఈ సినిమా 4కే ప్రింట్‌తో రీ-రిలీజ్ కానుంది. తొలిసారి ఒక సీనియర్ హీరో, అది కూడా ఐదు దశాబ్ధాల క్రితం వచ్చిన సినిమాను రిలీజ్ చేయనుండటం గమనార్హం. కే.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీ’ అనే హాలీవుడ్ మూవీను బేస్ చేసుకుని రూపొందింది. 1971 ఆగస్టు 27లో తొలి ఇండియన్ కౌబాయ్ చిత్రంగా రిలీజైన ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 50లక్షల గ్రాస్‌ను కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత 50లక్షల గ్రాస్ సాధించి మూడో హీరోగా కృష్ణ నిలిచారు. ఈ చిత్రం తమిళంలో ‘మొసక్కరనుక్కు మొసక్కరన్’, హిందీలో ‘గన్‌ఫైటర్ జానీ’ పేరుతో రిలీజైంది. ఇప్పుడు మనం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల గురించి చెప్పుకుంటున్నాం.. కానీ సూపర్ స్టార్ కృష్ణ 50ఏళ్ళ క్రితమే మోసగాళ్లకు మోసగాడుతో పాన్ వరల్డ్ సినిమా తీసి టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement