సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా నవంబర్ 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ క్యామియోకి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. టైగర్ గా సల్మాన్ ఖాన్ చేసిన ఫైట్స్ కి బాలీవుడ్ సినీ అభిమానులు భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. దీపావళి రోజున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కన్నా డే 2, డే 3 ఎక్కువ రాబట్టింది.
రెండు రోజుల్లో వంద కోట్లు, మూడు రోజుల్లో 180 కోట్లు రాబట్టి సల్మాన్ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 100 క్రోర్ గ్రాసర్ గా టైగర్ 3 నిలిచింది. కానీ ఆ తర్వాత నుంచే టైగర్ 3కి కష్టాలు మొదలయ్యాయి. ఇండియా న్యూజిలాండ్ సెమీ ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్, ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లు టైగర్ 3 సినిమా కలెక్షన్స్ ని పూర్తిగా దెబ్బ తీశాయి. ఓపెనింగ్ డే రోజున కూడా ఈవెనింగ్ ప్రతి ఒక్కరు పండగ చేసుకోవడంతో థియేటర్స్ కి ఎవరూ వెళ్ళలేదు.
ఈ కారణంగా ఓపెనింగ్స్ లో కూడా కాస్త డ్రాప్ కనిపించింది. క్రికెట్ ఉన్న రోజులు, పండగ రోజు భారీ డ్రాప్ ని ఫేస్ చేసింది టైగర్ 3. ఈ డేట్స్ ముందే ఊహించి కాస్త జాగ్రత్త పడి ఉంటే టైగర్ 3 సినిమా కలెక్షన్స్ ఇంకా బాగుండేవి. ఓవరాల్ గా ఇప్పటివరకూ టైగర్ 3 సినిమా 425 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రావాలంటే కనీసం 600 కోట్ల గ్రాస్ రావాలి..ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే వంద కోట్ల లాస్ రావచ్చని చిత్ర యూనిట్ అంటున్నది..