Sunday, November 17, 2024

Threatening Calls రజాకార్ నిర్మాతకు బెదిరింపులు – కేంద్ర బలగాలతో భద్రత …

రజాకార్‌ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించారు. తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా రజాకార్‌. రాజకీయంగా ఎన్నో వివాదాలకు కేంద్రంగా నిలిచిన ఈ చిత్రం అనేక అడ్డంకుల్ని దాటుకొని మార్చి 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement