Monday, October 21, 2024

Movies | ఈ వారం వినోదం.. చిన్న సినిమాల సంద‌డి !

ఈ వారం సినిమాలు థియేట‌ర్ల‌లో సందడి చేయ‌నుండ‌గా, ఒటిటిల‌లో సైతం వాటి హ‌వా కనిపించ‌నుంది. సూపర్‌ హీరో చిత్రాలకు హాలీవుడ్‌ పెట్టింది పేరు. ఆ కోవలోనే వచ్చిన ‘వెనమ్‌’ దాని సీక్వెల్‌ విశేషంగా అలరించాయి. ఇప్పుడు కొనసాగింపుగా మూడో చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ విడుదలకు సిద్ధమైంది.

థియేట్రిక‌ల్ సినిమాలివే..

  • అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో సాహిత్‌ మోత్కూరి తెరకెక్కించిన చిత్రం ‘పొట్టేల్‌స‌. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది
  • సాయిరోనక్, ప్రగ్యా నగ్రా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘లగ్గం’. తెలంగాణ ప్రాంత పెళ్లి నేపథ్యంలో సాగే ఈ మూవీ 25న విడుదల కానుంది.
  • హర్షా నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్. 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • శివకుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ ప్రసన్న, శ్రుతిజయన్‌, ఐశ్వర్య అనిల్‌ కుమార్‌, వైవా రాఘవ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలో..

నెట్‌ఫ్లిక్స్ :
ఫ్యామిలీ ప్యాక్‌ (హాలీవుడ్‌) – అక్టోబరు 23
ది కమ్‌బ్యాక్‌ 2004 బోస్టర్‌ రెడ్‌ సాక్స్‌ (వెబ్‌సిరీస్‌) – అక్టోబరు 23
బ్యూటీ ఇన్‌ బ్లాక్‌ (వెబ్‌సిరీస్‌) – అక్టోబరు 24
టెర్రిటరీ (వెబ్‌సిరీస్) – అక్టోబరు 24
దట్‌ నైన్టీస్‌ షో (వెబ్‌సిరీస్) – అక్టోబరు 24
దో పత్తీ (హిందీ) – అక్టోబరు 25
డోంట్‌ మూవ్‌ (హాలీవుడ్) అక్టోబరు 25
హెల్‌ బౌండ్‌2 (కొరియన్‌) అక్టోబరు 25

అమెజాన్‌ ప్రైమ్‌ :
నాటిలిస్‌ (వెబ్‌సిరీస్‌) – అక్టోబరు 25
జ్విగాట్‌ (హిందీ) – అక్టోబరు 25

జియో సినిమా :
ది బైక్‌ రైడర్స్‌ (హాలీవుడ్‌) – అక్టోబరు 21
ఫ్యూరియోసా: ఎ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా (తెలుగు డబ్‌) – అక్టోబరు 23
ది మిరండా బ్రదర్స్‌ (హిందీ) – అక్టోబరు 25

డిస్నీ+హాట్‌స్టార్‌ :
ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్‌) – అక్టోబరు 25

- Advertisement -

జీ5 :
ఐందం వేదం (తమిళ) – అక్టోబరు 25
ఏ జిందగీ (హిందీ) – అక్టోబరు 25

ఆపిల్‌ టీవీ ప్లస్ :
బిఫోర్‌ (వెబ్‌సిరీస్‌) – అక్టోబరు 25

Advertisement

తాజా వార్తలు

Advertisement