టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ ఒకరు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన సినమాల్లో బెస్ట్ కామెడీ అండ్ ఫ్రెండ్స్ జోనర్ మూవీగా “ఈ నగరానికి ఏమైంది” సినిమా పేరు తెచ్చుకుంది. ఈ సూపర్ హిట్ మూవీలో విశ్వక్సేన్, సిమ్రాన్ చౌదరి, అభినవ్ గోమతం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
కాగా, విశ్వక్సేన్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ “ధమ్కీ” ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల అతను వైజాగ్‌లోని ఒక కాలేజీని సందర్శించాడు, అక్కడ తన మూవీ ఈ నగరానికి ఏమైంది మూవీ రీ-రిలీజ్ గురించి అడిగారు స్టూడెంట్స్. ధమ్కీ విడుదలకు ఒక వారం ముందు ENE మళ్లీ బిడ్ స్క్రీన్స్ పైకి వస్తుందని విశ్కక్ బదులిచ్చాడు.
ధమ్కి ఈ నెల (మార్చి) 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీని ప్రకారం, ఈ నగరానికి ఏమైంది మూవీ ఈ నెల మూడో వారంలో థియేటర్లలో రీ-రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ధమ్కీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ మూవీలో నివేదా పేతురాజ్ కథానాయికగా కనిపించనుంది.