నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా శుక్రవారం సోషల్ మీడియాలో సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అలాగే ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. కాగా 1975వ సంవత్సరంలో ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి రాసిన లేఖ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ లేఖలో ఏముందంటే …అభిమానమును మించిన ధనము ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు.
ఇందరి సోదరు ప్రేమాను రాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్టే! నా శుభాకాంక్షలు. సోదరుడు రామారావు అని లేఖలో ఎన్టీఆర్ పేర్కొన్నారు. ముగించారు. 1975వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన ఈ లేఖను రాశారు ఎన్టీఆర్.