టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో తనకి ఉన్న బంధాన్ని బయటపెట్టాడు స్టయిలీస్ట్ , కస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్.తెలిసిన, క్లోజ్‌గా ఉన్న ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సపోర్ట్ గా నిలవడమనేది కామన్. నేనూ అదే చేశాను. సమంత క్లోజ్ కావడంతో ఆమెకి సపోర్ట్ గా ఉన్నాను, అంతేకాని తమ మధ్య ఏం లేదని, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అని చెప్పాడు. దాన్ని కొందరు తప్పు పట్టడం బాధగా అనిపించిందన్నారు. అంతేకాదు తన సెక్సువాలిటీ మీద కూడా కామెంట్లు చేశారు. తాను గే అంటూ ఆర్టికల్స్ రాశారు. తన గురించి తన అనుమతి లేకుండా, నిజాలు తెలుసుకోకుండా ఎలా రాస్తారని ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత తెలిసింది అది పెయిడ్ ఆర్టికల్ అని, కొందరు కావాలని రాయించినట్టు తెలిసిందన్నారు.
అయితే పరిణామాలు తనని చాలా బాధ పెట్టాయని, బయటకు చెప్పుకోలేదు కానీ, లోపల చాలా బాధపడినట్టు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కొంత దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. బట్ తాను మాత్రం వీటిని లెక్క చేయనని, మనం ఏదైనా మంచి చేస్తే నెగటివిటీ కూడా వస్తూనే ఉంటుందని, ఈ ఆరేడుఏళ్లలో తాను చాలా నేర్చుకున్నానని తెలిపారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ విషయం గురించి చెబుతూ, తాను హీరోలు, హీరోయిన్లకే కాదు పూర్తి సినిమాలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నానని, ధమాఖా, యశోద, ఓ బేబీ వంటి చిత్రాలకు పనిచేశానని, పెద్ద బ్రేకిచ్చే సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని, తన డిజైన్స్ ని విస్తరించాలని, అదొక బ్రాండ్‌గా తయారు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు.