Monday, November 11, 2024

మూడు నెలలు…ముచ్చటగా మూడు బ్లాక్ బాస్టర్స్ – టాలీవుడ్ రిపోర్ట్

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో థియేటర్లకు పర్మిషన్ వచ్చిన తర్వాత గడిచిన మూడు నెలల్లో మొత్తం 67 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో మొదటిది రవి తేజ క్రాక్ సినిమా. మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 50 శాతం ఆక్యుపెన్సీ తో నడుస్తున్న సమయంలో కూడా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఉప్పెన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా అంచనాలకు అనుగుణంగానే కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంతేకాకుండా నటులుగా వైష్ణవ్ తేజ్, కృతికి మంచి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది.

ఇక మార్చి లో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . నవీన్ పోలిశెట్టి,ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ,ప్రధాన పాత్రలలో నటించారు. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది . అలాగే విజయ్ దళపతి హీరోగా వచ్చిన మాస్టర్ చిత్రం కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకొని లాభాలు సాధించింది.

మరో వైపు యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కూడా నిర్మాతలకు నష్టాలు కలిగించలేదు. అలాగే ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డి చిత్రం కూడా లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా అల్లరి నరేష్ నాంది సినిమా విమర్శకులను సైతం మెప్పించి ప్రశంసలందుకుంది. ఈ సినిమా కూడా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మొత్తంగా ఈ ఏడాది క్వార్టర్లీ రిపోర్ట్ చూసుకుంటే టాలీవుడ్ లో 3 బ్లాక్ బస్టర్‌లు మాత్రమే పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement