Tuesday, January 7, 2025

Sankranti Movies | సంక్రాంతికి సందడే సందడి.. పెద్ద స్టార్ల హంగామా !

సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి బ‌డా హీరోలు బ‌రిలోకి దిగుతున్నారు. ఈ పండగ సీజన్‌లో భారీ బడ్జెట్‌ సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టి పోటీ క‌నిపించ‌నుంది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతి వ‌స్తున్నాం’, సందీప్ కిషన్ ‘మజాకా’ తో పాటు.. డ‌బ్బింగ్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు సంక్రాంతి రేసులో పోటీకి దిగుతున్నాయి.

గేమ్ చేంజర్ : ఈ సంక్రాంతికి మొట్టమొదటిగా థియేటర్లలోకి దిగే చిత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు సిద్ధమైంది.

- Advertisement -

గుడ్ బ్యాడ్ అగ్లీ : ప్రముఖ కోలీవుడ్ హీరో అజిత్ , మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమా తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా సంక్రాంతికి విడుదల కాబోతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది.

డాకు మహారాజ్ : నటసింహం నందమూరి బాలయ్య.. ‘డాకు మహారాజ్’గా థియేటర్లలోకి మాస్ బీభత్సాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లలోకి రానుంది.

సంక్రాంతికి వస్తున్నాం : జనవరి 14న సంక్రాంతి రోజు.. సంక్రాంతి వైభవాన్ని తీసుకొచ్చేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ విక్టరీ వెంకటేష్ థియేటర్లలోకి దిగబోతున్నారు.

మజాకా : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ జనవరి 14వ తేదీన ‘మజాకా’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకి రానున్నాడు. త్రినాధ రావు దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ , హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అయితే ఈ సంక్రాంతి విజేతగా, బాక్సాఫీస్ కింగ్‌గా ఎవరు నిలుస్తారో తెలియాలంటే పండగ వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement