కన్నడ హీరో రిషబ్ శెట్టి రాజకీయప్రవేశంపై స్పందించారు..తాను రాజకీయాల్లోకి రాబోనని తెలిపారు.. కాంతార చిత్రం తో హీరో రిషబ్ శెట్టి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆయన ఇంటర్వ్యూల కోసం నేషనల్ మీడియా సైతం క్యూ కట్టింది. కాంతార చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రిషబ్ చేయబోయే నెక్ట్స్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో రిషబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త కన్నడ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించారు రిషబ్. తనకు రాజకీయాల్లోకి రావాలని లేదని..కానీ తన సినిమాలకు ప్రేక్షకుల మద్దతు ఇవ్వాలని కోరారు.
రిషబ్ శెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాడుకు చెందిన ఓ జర్నలిస్ట్ ట్వీట్ పై స్పందించారు ఈ హీరో. తాను రాజకీయాల్లోకి రావడమనేది నిజం కాదని.. ఇది తప్పుడు వార్త అని అన్నారు. కొంతమంది నన్ను తమ పార్టీకి మద్దతుదారుడిగా ఉండమన్నారు. కానీ నేను రాజకీయాల్లోకి మాత్రం రాను అని రిప్లై ఇచ్చారు రిషబ్. ఇక ఈ హీరో ట్వీట్ కు ఓ అభిమాని స్పందిస్తూ.. మీరు రాజకీయాల్లోకి రండి నేను మద్దతు ఇస్తాను అంటూ కామెంట్ చేశాడు.ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ హీరోస్.. డైరెక్టర్ల హవా కొనసాగుతుంది. ఇప్పటికే రాజమౌళితోపాటు.. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, యశ్, ప్రశాంత్ నీల్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై రికార్డ్స్ బ్రేక్ చేసింది కాంతార చిత్రం.