ఇటీవల కాలంలో మావోయిస్టుల దాడిలో 22 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందడంతో నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టుల నేపథ్యం మీద ఆధారపడి వారి సిద్ధాంతాలకు టెండర్ చేసిన సినిమాలకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వవద్దని కోరుతూ యాంటీ టెర్రరిజం ఫోరం సెన్సార్ బోర్డును కలిసింది. నక్సలిజం భావజాలం గురించి సానుకూలతను వ్యాప్తి చేసే చిత్రాలను నిషేధించాలని కోరింది. కాగా ఈ సందర్భంలో, విరాటా పర్వం, ఆచార్యలపై సిబిఎఫ్సి ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే విషయం ఆసక్తికరంగా మారింది. ఇవి వరుసగా ఏప్రిల్ 30 మరియు మే 13 న ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య . భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి కూడా విచ్చల విడిగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా తో పాటు చాలా సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.