కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్లు అవుతున్నా అదే జోష్ ను చూపిస్తుంది హీరోయిన్ శ్రీయ. ఇప్పటికి కూడా ఈ అమ్మడు చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అయితే మాములుగా ప్రతీ హీరోయిన్ కూడా పెళ్లి తరువాత కొంత గ్యాప్ ఇస్తూ ఉంటారు. శ్రీయ మాత్రం ఆ గ్యాప్ కూడా ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయ ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.
కాగా తాజాగా తన భర్త ఆండ్రూ తో కలిసి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హీరోయిన్ శ్రీయ కెమెరాకు దగ్గరగా ఉంటే…ఆండ్రూ మాత్రం కాస్త దూరంలో ఉంటాడు. శ్రీయ తల మీదున్నట్టుగా, డ్యాన్స్ చేస్తున్నట్లు, నాలుక మీద కూర్చున్నట్టు కనిపిస్తాడు . ఇక లాస్ట్ కి తన భర్తను తాను మింగిసినట్టు కూడా శ్రీయ కనిపిస్తుంది.