Saturday, January 4, 2025

Game Changer ట్రైలర్ వచ్చేసింది !

శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి టీజర్, నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. రిలీజయిన సాంగ్స్ అన్ని ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్ప‌టికే వ‌చ్చిన‌ టీజర్, నాలుగు పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండ‌గా.. తాజాగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.

కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, విశ్వంత్‌.. ఇలా పలువురు తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement