నాని, ప్రియాంక మోహన్, ఎస్.జె.సూర్య వంటి స్టార్ కాస్ట్‌తో వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సినిమా “సరిపోదా శనివారం”. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆగస్ట్ 13న ట్రైలర్‌ను విడుదల చేశారు.
కాగా, అంతకముందు సుదర్శన్ థియేటర్లో నాని అభిమానుల సమక్షంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. అభిమానుల కోలాహలంతో థియేటర్ అంతా మారుమోగింది. అభిమానుల కేరింతల మధ్య థియేటర్లో నాని ట్రైలర్‌ని వీక్షించారు. ఆ తరువాత తాజాగా, యూట్యూబ్‌లో
ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ.. సుదర్శన్ థియేటర్‌తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘జెర్సీ, దసరా స్పెషల్ షోలు ఇక్కడే పడ్డాయిసు దర్శన్‌లో ఎన్నో చిత్రాలు చూశాను.. మీ అందరిలా నేను ఎన్నో చిత్రాలు చూశా.. వివేక్ ఈ ట్రైలర్‌ని నాకు చూపించాడు. ఫోన్లో, ఇంట్లో చూడాల్సిన ట్రైలర్ కాదని.. ఇలా సుదర్శన్‌లో అభిమానుల మధ్య చూసే ట్రైలర్ అని, ఈవెంట్ ఇక్కడ పెట్టాలని ఫిక్స్ అయ్యా..’’ అని అన్నాడు.