Wednesday, September 18, 2024

Devara | సెన్సార్ పూర్తి… ర‌న్ టైమ్ ఎంతంటే !

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ నెల‌ 27న భారతీయ ప్రధాన భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కాగా, దేవర మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు సెన్సార్‌ బోర్డు వెల్లడించింది. కాగా సినిమా నిడివి సుమారు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉండబోతోంది.

నందమూరి కళ్యాణ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించారు. ఇక‌ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో న‌టించ‌గా… లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement